జైలర్ 2లో షారుఖ్ ఖాన్.. అధికారిక ప్రకటనే ఆలస్యం

by Naga Rani Yarlagadda |

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్ 2.

జైలర్ 2లో షారుఖ్ ఖాన్.. అధికారిక ప్రకటనే ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్ 2. జైలర్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అందుకే జైలర్ 2 సినిమా కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ క్రేజీ సీక్వెల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో పలువురు స్టార్స్ క్యామియో రోల్స్ చేస్తున్నారు.

జైలర్ సినిమాలో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు.. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జైలర్ 2 సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. శివరజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణలతో పాటు షారుక్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జైలర్ 2 లో షారుఖ్ నటిస్తున్నారన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.

Next Story