- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో సుస్సు పోసుకోవడం ఖాయం
టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి(Adi Pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘శబ్దం’(Shabdam) సినిమాలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో ఆదిపిని శెట్టి(Adi Pinishetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘శబ్దం’(Shabdam) సినిమాలో నటిస్తున్నాడు. దీనికి అరివఝాగన్(Arivazhagan) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇది 2009లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘వైశాలి’(Vaishali)కి సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 7జీ ఫిలిమ్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్(Trailer) సోషల్ మీడియా(Social Media)లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది.
ఇక కథ విషయానికొస్తే.. ఓ మెడికల్ కాలేజీలో అనుమానాస్పదంగా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు చనిపోతారు. అయితే అక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయని అంతా అనుకుంటారు. మీడియా, పోలీస్‌దాకా వెళ్తే కాలేజీ విలువ దెబ్బ తింటుందని ఓ ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్(పారానార్మల్ ఇన్‌స్పెక్టర్) వ్యూమా(ఆది)ని పిలిపిస్తారు. వ్యూమా మనుషులకు వినపడని శబ్దాలు తన పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడుతూ కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో వ్యూమా ఆ కాలేజీలో ఆత్మలు ఉన్నాయా అని పరిశోధన మొదలుపెడతాడు.
ఆ కాలేజీలో చదువుతూ జాబ్ చేసే అవంతిక(లక్ష్మి మీనన్)మీద అనుమానం మొదలవుతుంది. అదే సమయంలో మరో అమ్మాయి కూడా చనిపోతుంది. చనిపోయిన ముగ్గురు మధ్యలో కొన్ని కామన్‌గా ఉండటం, అవంతికకు కూడా వాటికి లింక్ ఉంది అని వ్యూమాకు అనిపిస్తుంది. వ్యూమా అవంతికపై ఓ ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ 42 ఆత్మలు ఉన్నట్టు కనిపెడతాడు. మరి ఆ 42 ఆత్మలు ఎవరివి? కాలేజీ స్టూడెంట్స్ ముగ్గురు ఎలా చనిపోయారు? అవంతికకు ఆ చావులకు ఏంటి సంబంధం? వ్యూమా అక్కడ ఆత్మలతో మాట్లాడాడా? ఏం చేసాడు అనేదే శబ్దం మూవీ కథాంశం.
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. ఇటీవల ఒక మంచి హారర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇది పూర్తిస్థాయి హారర్ కాకపోయినా బాగా భయపెట్టారు. ఫస్ట్ హాఫ్‌లో కాలేజీలో స్టూడెంట్స్ చనిపోవడం, వ్యూమా రావడం, అవంతికని అనుమానించడంతో సాగుతుంది. ఇంటర్వెల్‌కి అక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పే సీన్‌తో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ ఆత్మల ఫ్లాష్ బ్యాక్, హీరో ఫ్లాష్ బ్యాక్, హీరో ఆత్మల కోసం పోరాడటంతో ఓ రెగ్యులర్ సినిమాలా సాగుతుంది. ఫైనల్‌గా మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుందనే చెప్పాలి.






