ట్రైన్‌లో నా వక్షోజాలు పట్టుకుని లాగాడు.. పోలీసులు కూడా.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-06 02:55:54  IST  )

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు సేఫ్టీ అనేది చాలా తక్కువ. అసలు ఎవరు ఎక్కడ చేతులు వేస్తారో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది. ప్రశ్నిస్తే అనుకోకుండా తగిలిందని.. దానికే రచ్చ చేస్తున్నావని దబాయిస్తారు. అయితే ఇలాంటి అనుభవమే తనకు

ట్రైన్‌లో నా వక్షోజాలు పట్టుకుని లాగాడు.. పోలీసులు కూడా.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు సేఫ్టీ అనేది చాలా తక్కువ. అసలు ఎవరు ఎక్కడ చేతులు వేస్తారో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది. ప్రశ్నిస్తే అనుకోకుండా తగిలిందని.. దానికే రచ్చ చేస్తున్నావని దబాయిస్తారు. అయితే ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని తెలిపింది ప్రముఖ సీరియల్ హీరోయిన్ అదితి పోహంకర్. చాలా ఘోరమైన పరిస్థితి అని.. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక షాక్‌లో అలాగే ఉండిపోయానని.. పోలీసులకు చెప్పినా లాభం లేదని అభిప్రాయపడింది. తను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి పంచుకుంది.

‘నేను ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు లేడీస్ అపార్ట్‌మెంట్‌లో ఎక్కాను. పద్దెనిమిదేళ్ల కన్నా తక్కువ వయసున్న అబ్బాయిలు అందులో ఎక్కేందుకు పర్మిషన్ ఉంటుంది. ఒక వ్యక్తి అలాగే ఎక్కాడు. ట్రైన్ మూవ్ అయ్యాక సడెన్‌గా రెండు చేతులతో నా వక్షోజాలు పట్టుకుని లాగాడు. నేను షాక్ అయిపోయి అలాగే ఉన్నా. ఏం చేయాలో తెలియక నెక్స్ట్ స్టేషన్‌లో పోలీసులకు కంప్లెయింట్ చేశా. కానీ ఇప్పుడేమైంది.. ఏం కాలేదు కదా.. అని లైట్ తీసుకున్నాడు పోలీసు ఆఫీసర్. తిరిగి వెనక్కి చూస్తే అదే అబ్బాయి మరో అమ్మాయిని అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చింది.

Next Story