- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ బాడీలో ఆ పార్ట్స్ మస్త్ సెక్సీగా ఉన్నాయ్.. రూమ్‌కు వస్తావా.. నటికి నిర్మాత లైంగిక వేధింపులు
‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్రతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది నటి జెన్నిఫర్ మిస్ట్రీ. కెరీర్ పరంగా సక్సెస్ పీక్స్ చూసిన ఆమెకు.. నిర్మాత అసిత్ మోదీపై షాకింగ్ ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేశాయి.

దిశ, వెబ్ డెస్క్ : ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్రతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది నటి జెన్నిఫర్ మిస్ట్రీ. కెరీర్ పరంగా సక్సెస్ పీక్స్ చూసిన ఆమెకు.. నిర్మాత అసిత్ మోదీపై షాకింగ్ ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేశాయి. కొందరు ఆమె కావాలనే ఇదంతా చేస్తుందని తప్పు పట్టారు. మొఖం మీదనే విమర్శించారు. 2019లో సింగపూర్ షూటింగ్ సమయంలో.. నిర్మాత అసిత్ మోదీ ఆమె పెదవుల గురించి అనుచితంగా మాట్లాడాడని..‘నీ లిప్స్ చాలా సెక్సీగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించాడని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నటి. రూమ్‌కు కూడా రమ్మన్నాడని వెల్లడించింది. 2024లో అసిత్‌పై లైంగిక వేధింపుల కేసులో గెలిచిన జెన్నిఫర్.. బహిరంగంగా ఈ విషయాన్ని వెల్లడించడం ఇదే తొలిసారి.
కాగా ఈ మధ్యే నటి తనుశ్రీ దత్తా కూడా మీటూ అలిగేషన్స్ తర్వాత తన లైఫ్ దారుణంగా మారిపోయిందని మరోసారి మీడియా ముందుకు వచ్చింది. తన ఇంటికి వచ్చి రోజూ టార్చర్ చేస్తున్నారని.. సొంత ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా పోయిందని, మెంటల్‌గా హరాజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం పని మనుషులను పెట్టుకునేందుకు కూడా సరైన వాతావరణం లేదని.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగే తన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చింది.






