- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టలన్నీ విప్పి కూర్చో.. నీ బాడీ ఎంత కంఫర్ట్‌గా ఉందో చెక్ చేయాలి.. యంగ్ హీరోయిన్‌ను డిమాండ్ చేసిన డైరెక్టర్.. (లింక్)
డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై ఇంతకు ముందు సెక్సువల్ హరాజ్మెంట్ ఆరోపణలు చాలానే వచ్చాయి. మీటూ మూమెంట్ టైమ్‌లో ఇండస్ట్రీకి చెందిన దాదాపు తొమ్మిది మంది ఆయన లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

దిశ, వెబ్‌సైట్ : డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై ఇంతకు ముందు సెక్సువల్ హరాజ్మెంట్ ఆరోపణలు చాలానే వచ్చాయి. మీటూ మూమెంట్ టైమ్‌లో ఇండస్ట్రీకి చెందిన దాదాపు తొమ్మిది మంది ఆయన లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నవీనా బోలె కూడా ఇలాంటి భయానక అనుభవాన్ని పొందినట్లు తెలిపింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన తనకు ఆఫర్ ఉందని.. కలవాలని.. సాజిద్ నుంచి ఫోన్ కాల్ రావడంతో చాలా ఎగ్జైట్ అయిపోయినట్లు చెప్పింది. కానీ అక్కడికి వెళ్లాక జరిగిన ఘటనతో జీవితంలో మరోసారి ఈ వ్యక్తిని మీట్ కావొద్దని అనుకున్నట్లు తెలిపింది.
‘ నేను కలిసింది తన ఆఫీసులో కాదు. ఇంట్లోనే కలవమన్నాడు. మంచి రోల్ దొరుకుతుందనే ఆశతో వెళ్లా. కానీ నన్ను బట్టలు విప్పి కూర్చోమన్నాడు. నీ బాడీ ఎంత కంఫర్ట్‌గా ఉందో చూడాలని అనుకుంటున్నా అన్నాడు. నాకు చాలా అన్‌కంఫర్ట్‌గా అనిపించింది. నా కోసం కింద వెయిట్ చేస్తున్నారని చెప్పా. దీంతో అతను సంబంధం లేకుండా స్టేజీపైనా బికినీ వేసుకోవచ్చు కదా అంటూ కొన్ని బూతు పదాలను వాడాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.






