- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్‌పై దారుణమైన ట్రోలింగ్..
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న లావణ్య, గతంతో పోలిస్తే కొంత బరువు పెరిగి బొద్దుగా కనిపించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్‌తేజ్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పర్సనల్ లైఫ్‌ను ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక గతేడాది ఈ మెగా కపుల్ జీవితంలోకి ఒక బుజ్జాయి అడుగుపెట్టాడు. వీరికి ఓ పండంటి మగబిడ్డ జన్మించగా, ఆ బాబుకి 'వాయువ్ తేజ్' అని నామకరణం చేసి తమ బిడ్డతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తల్లి అయిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా తన కొడుకు బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లావణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న లావణ్య, గతంతో పోలిస్తే కొంత బరువు పెరిగి బొద్దుగా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. అయితే అది చూసిన కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఒక్క బిడ్డను కనగానే ఆంటీలా మారిపోయిందంటూ ఆమె రూపాన్ని హేళన చేస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. ఈ దారుణమైన ట్రోలింగ్‌పై మెగా అభిమానులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తర్వాత ఏ మహిళ శరీరంలోనైనా మార్పులు రావడం పూర్తిగా సహజమైన విషయమని స్పష్టం చేస్తున్నారు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రతి తల్లి శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం ఖచ్చితంగా అవసరమని గుర్తు చేస్తున్నారు. మహిళల శరీరంలో వచ్చే ఇలాంటి సహజమైన మార్పులను సమాజం గౌరవించాలని, అంతేకానీ అలాంటి పవిత్రమైన సమయంలో ఒక మహిళ రూపాన్ని హేళన చేయడం, బాడీ షేమింగ్ చేయడం ఎంతమాత్రం సరికాదని ట్రోలర్లను గట్టిగా హెచ్చరిస్తున్నారు.






