అలారాలను సెట్ చేసుకోండి.. ఎస్‌జె సూర్య ‘కిల్లర్’ నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందంటూ పోస్ట్.. హైప్ పెంచుతున్న పోస్టర్

by Gugulothu.Kavitha |

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య (SJ Suryah) పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు.

అలారాలను సెట్ చేసుకోండి.. ఎస్‌జె సూర్య ‘కిల్లర్’ నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందంటూ పోస్ట్.. హైప్ పెంచుతున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య (SJ Suryah) పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం “కిల్లర్”(Killer). ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఇక దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్, ఎస్‌జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది.

దీంతో ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్. ‘ప్రేమ కోసం ఒకటి.. ఒక లక్ష్యం కోసం ఒకటి.. KILLER First Look ఈరోజు సాయంత్రం 6:09 గంటలకు రాబోతుంది.. మీ అలారాలను సెట్ చేసుకోండి’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రెండు బుల్లెట్స్ ఎదురెదుగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నట్లుగా ఉన్నాయి. అయితే ఒకటి ప్రేమ కోసం అయితే.. మరోకటి లక్ష్యం కోసమట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. Link

Next Story