- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క ముక్కలో డెకాయిట్ స్టోరీ మొత్తం చెప్పేసిన శేష్
తాజాగా శేష్ మాట్లాడుతూ... ఇది ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య జరిగే కథ. వారిద్దరూ మొదట్లో ఏం చేశారు అనేది చాలా చిన్నగా, సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత వారి ప్రయాణమే ఈ చిత్రం అని శేష్ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: అడవి శేష్ కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అందులో పంజా సినిమాలో ఈయన చేసిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో చిన్న పాత్రలో నటించినందుకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన క్షణం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీతో ఈయన కెరీర్ టర్న్ అయింది. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత ఈయన హీరోగా నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో మినిమం గ్యారెంటీ హీరోగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శేష్ డెకాయిట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఒక ఈవెంట్ను ఏర్పాటు చేసింది.
అందులో శేష్ మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీని సింపుల్గా చెప్పేశాడు. తాజాగా శేష్ మాట్లాడుతూ... ఇది ఇద్దరు ఎక్స్ లవర్స్ మధ్య జరిగే కథ. వారిద్దరూ మొదట్లో ఏం చేశారు అనేది చాలా చిన్నగా, సింపుల్గా ఉంటుంది. ఆ తర్వాత జర్నీనే ఈ చిత్రం. ఈ మూవీ ఎవరైనా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఎక్స్పెక్ట్ చేస్తే వారికి బిర్యానీ అనుకుని వెళ్తే పులిహోర లభించినట్లు ఉంటుంది అని ఈ నటుడు చెప్పుకొచ్చాడు.






