- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఛావా’ సినిమాను దానితో పోలుస్తూ హీరోయిన్ సంచలన ట్వీట్..
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. విక్కీ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు.
ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఒక ఈ సినిమాకు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ హీరోయిన్ మాత్రం సంచలన ట్వీట్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. ‘‘ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం జరిగిన కథని స్వల్పంగా కల్పితం చేసి చూపించే సినిమాలోని హింస దృశ్యాలకు స్పందిస్తున్న సమాజం.. కుంభమేళాలో తొక్కిసలాట, నిర్వహణ లోపం కారణంగా జరిగిన మరణాల గురించి మాట్లాడటం లేరు. అక్కడి శవాలను జెసిబిలతో ఎత్తవేయడాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. బ్రెయిడ్ డేట్ సొసైటీ’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం స్వర పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.
A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK
— Swara Bhasker (@ReallySwara) February 18, 2025






