చిరంజీవి, పవన్‌పై సెన్సేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఆర్జీవీ ట్వీట్ వైరల్

by Kema Shiva Kumar |

నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) మరోసారి సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్వీట్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

చిరంజీవి, పవన్‌పై సెన్సేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఆర్జీవీ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) మరోసారి సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్వీట్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. పవన్, జన సైనికులను కవ్వించి కయ్యం పెట్టుకునే పోస్టులు పెట్టే ఆర్జీవీ ఈసారి అనూహ్యంగా పవన్ చేసిన ఓ ట్వీట్‌కు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ప్రాణం ఖరీదు (Pranam Kareedu) చిత్రం విడుదలై నేటికి 47 సంత్సరాలు గడుస్తన్న నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. జన్మత: యోధుడు.. మన ప్రియమైన పెద్దన్నయ్య, శంకర్ బాబుగా పిలుచుకునే ‘మెగా‌స్టార్ చిరంజీవి’ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారంటూ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అయితే, ఆ ట్వీట్‌ను ప్రస్తుతం ఆర్జీవీ (RGV) రీ ట్వీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి సినిమా చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒక మెగా పవర్ కానుక అవుతుంది! ఇది శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story