మంచు మనోజ్ సంచలన ఆరోపణలు.. తనకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్

by Malleboina Mahesh |

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ(Manchu Family) ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

మంచు మనోజ్ సంచలన ఆరోపణలు.. తనకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ(Manchu Family) ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. గతంలో వారి కుటుంబంలో చెలరేగిన ఆస్తి తగాదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి కొడుకు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో మంచు మోహన్ బాబు(Mohan Babu), మనోజ్‌(manoj)ల వాదనలు ఎవరికి వారే తమపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు తన తండ్రి రౌడీలను పంపి తనను, తన భార్యను కొట్టించాడు అని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మనోజ్ జాయిన్ అవగా.. ఆయన ఒంటిపై గాయాలు అనుమానస్పదంగా ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నేడు ఈ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. తన తండ్రి వల్ల తనకు, తన భార్య బిడ్డలకు ప్రాణ హాని ఉందని, తమను రక్షించాలని కోరుతూ సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్(Pahadi Shareef PS) కు వెళ్ళి మనోజ్ లిఖిత పూర్వక కంప్లైంట్ ఇచ్చారు.

తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక వలన తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీ(Rachakonda CP)కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. కాగా ఈ వివాదంపై మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించిన మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను తన కుటుంబం కోసం 8 సంవత్సరాలుగు సినిమాలు చేస్తూ కష్టపడ్డానని.. కొన్నాళ్లుగా తన ఇంటి నుంచి అతని కుటుంబం దూరంగా ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారని, విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారని మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే MBU అవకతవకల్లో బాధితులకు తాను అండగా ఉన్నాననే.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రెండు పేజీల పిడిఎఫ్ ను అప్ లోడ్ చేశాడు. అలాగే తనను తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ హోమ్ మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ డీజీపీలకు ట్యాగ్ చేస్తూ.. తనకు సరైన న్యాయం చేయాలంటూ మంచు మనోజ్ రిక్వెస్ట్ చేశాడు.

Next Story