- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతపై సంచలన ఆరోపణలు.. విషయం తెలిస్తే షాకే!
ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన టీవీ షోలు రచ్చకెక్కుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన టీవీ షోలు రచ్చకెక్కుతున్నాయి. వ్యక్తిని, కమ్యూనిటీలు, మతాలపై సెలబ్రిటీలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ, సింగర్ సునీతలపై ఓ యంగ్ సింగర్ చేసిన వ్యా్ఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ ప్రముఖ మీడియా ఛానల్‌లో ప్రదర్శితం అవుతోన్న ‘పాడుతా తీయగా’ సింగింగ్ కాంపిటీషన్‌కు మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి, రచయిత చంద్రబోస్, సింగర్ సునీత న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కాంపిటీషన్‌లో ప్రవస్తి ఆరాధ్య అనే ఓ సింగర్ పాల్గొంది. ఇక్కడే అసలు ట్వీస్ట్ చోటుచేసుకుంది.
సెట్‌లో న్యాయ నిర్ణేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కీలక విషయాలను బయటపెట్టంది. ప్రోగ్రాంలో జడ్జీలుగా ఉన్నవాళ్లు పూర్తిగా పక్షపాతంగా వ్యహరిస్తున్నారని కామెంట్ చేసింది. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కవ మార్కులు ఇస్తారంటూ ప్రవస్తి ఆరాధ్య కామెంట్ చేసింది. వివాహ వేడుకల్లో పాటలు పాడినందుకు తనను ఘోరంగా అవమానించారని పేర్కొంది. షూటింగ్ టైమ్‌లో సెట్‌లో తనను బాడీ షేమింగ్ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఒక చీడపురుగులా చూశారని తెలిపింది. తమిళ షోలలో తాను చాలా పాటలు పాడనని.. కానీ, తనకు ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురు కాలేదని సింగర్ పవస్తి ఆరాధ్య వాపోయింది. అయితే, ప్రస్తుతం ఆరాధ్య చేసిన కామెంట్స్‌పై సదరు న్యాయ నిర్ణేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.






