- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మంచి వ్యక్తిగా ఉండండి.. కానీ దానిని నిరూపించడానికి సమయం వృథా చేయకండి’
సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సౌందర్య, సావిత్రి తర్వాత హోమ్లీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ అనేక సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో పద్ధతిగా కనిపించి.. జనాల మనసు దోచేసుకుంది.
అద్భుత నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. హనుమాన్, ప్రియమైన నీకు, తొలివలపు, రాజు, వసూల్ రాజా మాబ్స్, ఆటో గ్రాఫ్, వెంకీ, ఆయుధం, రాధా గోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, పాండు రంగడు వంటి సినిమాల్లో నటించి జనాల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ హీరోయిన్ వివాహనంతరం మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వినయ విధేయ రామతో రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే స్నేహ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని పలకరిస్తుంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
అయితే తాజాగా స్నేహ యల్లో కలర్ డ్రెస్‌పై బ్యూటిపుల్ పిక్స్ పంచుకుని.. ‘‘మంచి వ్యక్తిగా ఉండండి.. కానీ దానిని నిరూపించడానికి సమయం వృథా చేయకండి’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.






