మొదటిసారిగా మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చిన హోమ్లీ బ్యూటీ.. షాక్‌లో నెటిజన్లు

by Kodari Anjali |

సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

మొదటిసారిగా మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చిన హోమ్లీ బ్యూటీ.. షాక్‌లో నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సౌందర్య, సావిత్రి తర్వాత హోమ్లీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ అనేక సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో పద్ధతిగా కనిపించి.. జనాల మనసు దోచేసుకుంది. అద్భుత నటిగా గుర్తింపు దక్కించుకుంది.

హనుమాన్, ప్రియమైన నీకు, తొలివలపు, రాజు, వసూల్ రాజా మాబ్స్, ఆటో గ్రాఫ్, వెంకీ, ఆయుధం, రాధా గోపాలం, సంక్రాంతి, శ్రీరామదసు, చిన్నా, పాండు రంగడు వంటి సినిమాల్లో నటించి జనాల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ హీరోయిన్. వివాహనంతరం మళ్లీ చాలా ఏళ్ల అనంతరం వినయ విధేయ రామతో రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే స్నేహ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని పలకరిస్తుంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ నటి తాజాగా ఓ మోడ్రన్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ప్రజెంట్ స్నేహ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story