Sneha: యంగ్ లుక్‌ను తలపిస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్.. స్టన్నింగ్ పిక్స్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-03-01 10:09:31  IST  )

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ స్నేహ (Sneha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sneha: యంగ్ లుక్‌ను తలపిస్తోన్న సీనియర్ స్టార్ హీరోయిన్.. స్టన్నింగ్ పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ స్నేహ (Sneha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది. అందం, అభినయం, కలగలిసిన నటిగా స్నేహ మంచి పేరు దక్కించుకుంది. ఈ హీరోయిన్ తెలుగులో అనేక సినిమాల్లో నటించి.. ఉత్తమ నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన జోడి కట్టిందని చెప్పుకోవచ్చు.

స్నేహ అప్పట్లోనే కాకుండా ప్రస్తుతం కూడా సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకుపోతుంది. కీలక పాత్రల్లో నటిస్తూ అభిమానుల్ని అలరించే పనిలో పడింది. నాలుగు పదుల వయస్సులో కూడా అందంలో కుర్ర కథానాయికలకు గట్టీ పోటీ ఇస్తుంది. ప్రజెంట్ ఈ నటి తమిళం అండ్ తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. అలాగే కోలీవుడ్‌లో ఓ రియాలిటీ షోకు జజ్జిగా కూడా చేస్తోంది.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan)హీరోగా వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో స్నేహ ముఖ్య పాత్రలో నటించి జనాల్ని ఆకట్టుకుంది. తొలివలపు, ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, సంక్రాంతి, నీ సుఖమే నే కోరుకున్నా, వెంకీ , ఏవండోయ్ శ్రీవారు, రాధాగోపాళం (Radha Gopalam), మనసు పలికే మౌనరాగం, ఆదివిష్ణు, పాండురంగడు, s/o సత్యమూర్తి వంటి చిత్రాల్లో నటించి ఈ సీనియర్ హీరోయిన్ మెప్పించింది.

ఇకపోతే స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ముద్దుగుమ్మ రెడ్ కలర్ డ్రెస్ ధరించి.. ఆకట్టుకునే జ్యువెలరీ పెట్టుకుని స్టన్నింగ్ స్టిల్స్‌కు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు కుర్ర హీరోయిన్ ను తలపిస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story