- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మగాళ్లకు అక్రమ సంబంధాలు కామన్.. నా భర్తకు కూడా ఉన్నాయి.. కానీ నేను చేస్తే.. హీరోయిన్ సంచలనం..
సీనియర్ హీరోయిన్ ముంతాజ్ కెరీర్‌లో పీక్స్ చూసింది. 1960, 1970లలో అందానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. బాలీవుడ్‌ను షేక్ చేసేసింది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే వృత్తి విషయంలో సూపర్ సక్సెస్ అయిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సవాళ్లను ఎదుర్కొంది

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరోయిన్ ముంతాజ్ కెరీర్‌లో పీక్స్ చూసింది. 1960, 1970లలో అందానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. బాలీవుడ్‌ను షేక్ చేసేసింది. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే వృత్తి విషయంలో సూపర్ సక్సెస్ అయిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సవాళ్లను ఎదుర్కొంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానీని పెళ్లి చేసుకున్న ముంతాజ్.. హ్యాపీగానే ఉంది. కానీ లైఫ్‌లో ఓ హార్డ్ ఫేజ్ మాత్రం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె భర్త మరో మహిళతో ఎఫైర్ పెట్టుకోవడం.. ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఈ దశను రఫ్ ప్యాచ్‌గా వర్ణించింది.
అయితే మనీ, ఫేమ్ ఉన్నాయి కదా అని తాను భర్త నుంచి విడిపోదామనుకోలేదని.. వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు నిర్ణయించుకున్నానని తెలిపింది. ఒక్కసారి జరిగిన తప్పుగా వర్ణించి.. క్షమించినట్లు తెలిపింది. ఈ నిర్ణయానికి భర్త మయూర్ కూడా కారణమే.. ఆయన తన తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపపడ్డాడు. మరోసారి తప్పటడుగు వేయబోననని, నిబద్ధతతో ఉంటానని హామీ ఇచ్చాడు. వివాహం అనేది దీర్ఘకాలిక సంబంధమని.. కొన్ని సవాళ్లు ఎదురవడం సహజమేనని.. ఆ మాత్రానికే విడిపోకూడదని సూచించింది సీనియర్ హీరోయిన్.






