- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్లో సక్సెస్ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తే, వేగంగా వచ్చే విజయం అహంకారం పెంచుతుంది: సీనియర్ హీరో
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో ఎమోషనల్ సీన్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం ఎమోషనల్ సన్నివేశాల్లోనే కాకుండా.. డిఫరెంట్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌కు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో విక్టరీ వెంకటేష్ అనేక చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈయన నటించిన చిత్రాలన్నీ హిట్ అయినా.. కాకపోయిన అన్నింటిని తట్టుకుని వెంకీ ఈ స్థాయికి వచ్చాడు.
నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందాం, పవిత్ర బంధం (Pavitra bandhaṁ), బ్రహ్మపుత్రుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎఫ్- 3 వంటి చిత్రాల్లో నటించి తన నటనతో జనాల్ని ఆకట్టుకున్నాడు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.
ఇటీవలే వెంకటేష్ నటించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi vastunnāṁ) సినిమా సంక్రాంతికి థియేటర్లలో విడుదలై.. భారీ హిట్ కొట్టింది. టైమింగ్ పంచ్‌లు, ఫన్నీ సన్నివేశాలతో వెంకీ జనాల్ని ఆకట్టుకున్నాడు. వెంకీ సరసన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) అండ్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కథానాయికలుగా నటించి జనాల్ని మెప్పించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని పాటలు కూడా నెటిజన్లను బాగా మెప్పించాయి. ఇదంతా పక్కన పెడితే..
ఈ టాలీవుడ్ సీనియర్ హీరో సోషల్ మీడియా వేదిక ఏదో ఒక పోస్ట్ పెడుతుంటాడు. తాజా వెంకటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘స్లో సక్సెస్ పాత్రను నిర్మిస్తుంది, వేగవంతమైన విజయం అహంకారాన్ని పెంచుతుంది.. రతన్ నాన్న’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నటుడి రాసుకొచ్చిన మంచిమాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






