Sneha: చీకటి గది.. బ్లాక్ శారీలో సీనియర్ స్టార్ నటి ఖతర్నాక్ ఫోజులు!

by Kodari Anjali |

సౌందర్య(Saundarya), సావిత్రి (Savithri) తర్వాత హూమ్లీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది సీనియర్ నటి స్నేహ.

Sneha: చీకటి గది.. బ్లాక్ శారీలో సీనియర్ స్టార్ నటి ఖతర్నాక్ ఫోజులు!
X

దిశ, వెబ్‌డెస్క్: సౌందర్య(Saundarya), సావిత్రి (Savithri) తర్వాత హూమ్లీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది సీనియర్ నటి స్నేహ. ఈ బ్యూటీ అనేక సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సంప్రదాయ లుక్‌లో ఎంతో పద్ధతిగా కనిపించి స్నేహ నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అద్భుతనటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇంగానే ఓరు నీలపక్షి, ప్రియమైన నీకు, ఆనంద్, తొలి వలపు, హనుమాన్ జంక్షన్ (Hanuman Junction), రాజు, వసూల్ రాజా మాబ్స్ (Vasul Raja), ఆటోగ్రాఫ్, వెంకీ (Venky), ఆయుధం, సంక్రాంతి (Sankranthi), రాధా గోపాలం, చిన్నా, శ్రీ రామదాసు, ఎవండోయ్ శ్రీవారు, మధుమాసం, నీ సుఖమే నే కొరుకున్నా, పాండురంగడు (Pandurangadu), ఆది విష్ణువు, రాజన్న, S/O సత్యమూర్తి, వినయ విధేయ రామ, డ్రాగన్, కురుక్షేత్రం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఈ నటి సినిమాల్లో నటించే క్రమంలోనే నటుడు ప్రసన్న (Prasanna) ను ప్రేమ వివాహం చేసుకుంది. 2012 లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన స్నేహకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పెళ్లి అనంతరం ఈ హీరోయిన్ సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది.

వివాహనంతరం ఈ నటి గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) హీరోగా వచ్చిన వినయవిధేయ రామ (Vinayavidheya Rama) చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు మూవీల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తూ జనాల్ని అలరిస్తుంది. ఇకపోతే స్నేహ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటుంది. తాజాగా ఈ నటి చీకటి గదిలో.. బ్లాక్ శారీలో ఖతర్నాక్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం సీనియర్ నటి లేటెస్ట్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story