కుర్ర హీరోయిన్‌ను తలపిస్తోన్న సీనియర్ నటి.. మై క్వీన్ అంటూ హోమ్లీ బ్యూటీపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం

by Kodari Anjali |   (  Updated:2025-04-19 16:38:11  IST  )

సౌందర్య, సావిత్రి తర్వా హోమ్లీ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది సీనియర్ నటి స్నేహ.

కుర్ర హీరోయిన్‌ను తలపిస్తోన్న సీనియర్ నటి.. మై క్వీన్ అంటూ హోమ్లీ బ్యూటీపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: సౌందర్య, సావిత్రి తర్వా హోమ్లీ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది సీనియర్ నటి స్నేహ. ఈ బ్యూటీ అనేక సినిమాల్లో నటించి.. తన అందం, అభినయం, నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సంప్రదాయ లుక్‌లో ఎంతో పద్ధతిగా కనిపించి స్నేహ నెటిజన్ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అద్భుత నటిగా గుర్తింపు సంపాదించుకుంది.

ప్రియమైన నీకు, తొలి వలపు, హనుమాన్ జంక్షన్, రాజు, వసూల్ రాజా మాబ్స్, ఆటోగ్రాఫ్, వెంకీ, ఆయుధం, సంక్రాంతి,రాధా గోపాలం, శ్రీ రామదాసు, చిన్నా, నీ సుఖే నే కొరుకున్నా, పాండు రంగడు వంటి సినిమాల్లో నటించి జనాల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.

వివాహనంతరం మళ్లీ చాలా ఏళ్ల అనంతరం వినయ విధేయ రామ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే స్నేహ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఆకట్టుకునే డ్రెస్ ధరించి.. కాటుక కళ్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంది. స్నేహ లేటెస్ట్ పిక్స్ వీక్షించిన జనాలు వరుస కామెంట్లతో ముంచెత్తుతున్నారు. మై క్వీన్, లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story