విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి లైలా

by Pulgam srinivas |

లైలా మాట్లాడుతూ.. విజయ్ తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన సినిమాల్లో ఎంత అంకితభావంతో పనిచేశారో, ముఖ్యమంత్రిగా కూడా అదే స్థాయిలో కష్టపడతారని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి లైలా
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో విజయ్ మరికొంత కాలంలో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నటి లైలా తాజాగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లైలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “విజయ్ చాలా మంచి వ్యక్తి. చాలా మందికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన సినిమాల్లో ఎంత అంకితభావంతో పనిచేశారో, ముఖ్యమంత్రిగా కూడా అదే స్థాయిలో కష్టపడతారని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లైలా తాజాగా సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

Next Story