- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే.. అందరికీ కాదు.. సంచలనంగా మారిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కామెంట్స్
సౌత్ ఇండియా సీనియర్ యాక్టర్ సుమన్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.

దిశ, సినిమా: సౌత్ ఇండియా సీనియర్ యాక్టర్ సుమన్.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. తర్వాత విలన్ పాత్రలోనూ మెప్పించిన ఈయన.. ప్రస్తుతం పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అంతే కాకుండా... ఈ మధ్య కాలంలో కాంట్రవర్షి కామెంట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమ్మాయిలా డ్రెస్సింగ్‌పై సంచలన కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ఈ మేరకు.. ‘మీ కన్యత్వం మీ భర్తకు మాత్రమే.. అందరికీ కాదు.. అది మైండ్‌లో పెట్టుకుని టెంపుల్‌కి ఎలా డ్రెస్ చేసుకోవాలి.. పబ్‌కి ఎలా డ్రెస్ చేసుకోవాలి చూసుకోండి. మీరు మగవాళ్లని డిస్ట్రాక్ట్ చేసి.. మీ వైపు ఎట్రాక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలా అయినా ఉండండి.. బయటకి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ చూసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. లింక్






