- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మోకింగ్ అలవాటుపై ఓపెన్ అయిన సెల్వరాఘవన్.. యువతకు మంచి సందేశం ఇచ్చాడు
స్మోకింగ్ మానేయాలని ఉంది.. యువతకు సెల్వరాఘవన్ కీలక సూచనలు

దిశ, వెబ్ డెస్క్: తమిళ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా సినీ లవర్స్‌కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు, అలాగే ఈయన నటించిన అనేక చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక సెల్వరాఘవన్‌కు స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. తాజాగా ఈయన సినీ అనలిస్ట్ అమూత భారతి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్మోకింగ్ అలవాటు గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
అమూత భారతి అడిగిన ప్రశ్నకు స్పందించిన సెల్వరాఘవన్... తాను మార్చుకోవాలనుకునే ఒకే ఒక అలవాటు ‘స్మోకింగ్’ అని ఓపెన్ గానే చెప్పారు. “స్మోకింగ్ హ్యాబిట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, దానిని మానడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఆది జరగలేదు. అవకాశం వస్తే తప్పకుండా సిగరెట్ స్మోకింగ్ మానేస్తానని చెప్పారు. ఎవరైనా నా మాట వింటే నేను ఒకే విషయం చెబుతాను... ఏం చేసినా పర్లేదు కానీ ఎప్పుడూ కూడా స్మోకింగ్ జోలికి వెళ్ళద్దని తెలిపారు. ఈ నటుడు మరియు దర్శకుడు ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం, యువతకు అవగాహన కలిగించే విధంగా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






