‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం రీరిలీజ్ డేట్ ఖరారు.. ఎగిరిగంతులేస్తోన్న ఫ్యాన్స్

by Kodari Anjali |   (  Updated:2025-02-21 14:46:04  IST  )

శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో సూపర్ హిట్ మల్టీస్టారర్ క్లాసికల్ చిత్రం (Super hit multistarrer classical film) రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం రీరిలీజ్ డేట్ ఖరారు.. ఎగిరిగంతులేస్తోన్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ విలువలు, అనుబంధాల గురించి అత్యున్నత స్థాయిలో వెండితెర మీద వినోదభరితంగా చూపించిన తెలుగు సినిమాల్లో విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu) ఒకటి. ఈ సినిమాకు రికార్డులు బద్దలు కొట్టే రేంజ్‌లో కలెక్షన్లు రాకపోయినా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కలెక్ట్ అయింది. అయితే.. మిక్స్‌డ్ టాక్, రివ్యూల వల్ల అనేకమంది థియేటర్లలో ఈ సినిమాను మిస్ చేసుకున్నారు. అందుకే చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను మరోసారి థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయింది. వచ్చే మార్చి 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు అన్నాదమ్ములుగా నటించారు. సమంత(Samantha), అంజలి(Anjali), ప్రకాశ్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో పోషించారు. 2013లో సంక్రాంతి(Sankranti) కానుకగా విడుదలైన ఈ సినిమా.. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీసు ముందుకు రాబోతోంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు.

Next Story