సీక్రెట్‌గా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు కాబోయే భర్త ఫొటో రివీల్ చేసి షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ

by Mallepaka Hamsa |

ప్రముఖ హీరోయిన్ అభినయ(Abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుట్టుకతోనే మూగ, చెవుడు అయినప్పటికీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి తన కల నెరవేర్చుకుంది.

సీక్రెట్‌గా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు కాబోయే భర్త ఫొటో రివీల్ చేసి షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా: ప్రముఖ హీరోయిన్ అభినయ(Abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుట్టుకతోనే మూగ, చెవుడు అయినప్పటికీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ అమ్మడు తండ్రి కూడా నటుడు కావడంతో అమ్మడుకి కలిసివచ్చింది. ‘నాడోడిగళ్’ (Nadodigal)ద్వారా వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చి ‘నేనింతే’ (Neninthe) మూవీలో కీలక పాత్రలో నటించింది. కళ్లతోనే ఎమోషన్స్ పలికించిన ఆమె పుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో చెల్లి పాత్రలో నటించింది. తమిళంలో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

అయితే ఇటీవల అభినయ, విశాల్ ప్రేమించుకుంటున్నారంటూ పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు స్పందించి అవన్నీ అబద్ధాలని చెప్పారు. అయినప్పటికీ పుకార్లకు చెక్ పడలేదు. అభినయ ప్రేమలో ఉందనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వెల్లడిస్తూ.. తనకు కాబోయే భర్త ఫొటో షేర్ చేసింది.

తన ప్రియుడు సన్నీ వర్మతో మార్చి 9న నిశ్చితార్ధం జరిగినట్లు తెలుపుతూ గుడిగంట కొడుతోన్న ఫొటోను నెట్టింట పెట్టింది. ఇక అభినయ పోస్ట్ నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఆమెకు కాబోయే భర్తకు సంబంధించిన విషయాలను నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అయితే అభినయకు కాబోయే భార్య ప్రముఖ కన్‌స్టక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, మైనింగ్, రైల్వేల నిర్మాణంలో భాగమైన అంతర్జాతీయ సంస్థలో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం అభినయ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Next Story