మనసుని హత్తుకునే ‘సల్లగుండాలే’.. చాంపియన్ నుంచి మరో సాంగ్

by Sujitha Rachapalli |

ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,

మనసుని హత్తుకునే ‘సల్లగుండాలే’.. చాంపియన్ నుంచి మరో సాంగ్
X

దిశ, సినిమా : ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ కాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘సల్లంగుండాలే’ రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని.. తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించడం.. ప్రతి కుటుంబ సభ్యుడు వివాహానికి అందిస్తున్న బహుమతుల గురించి మాట్లాడే విధానం సాంప్రదాయ వేడుక సారాంశాన్ని అందంగా చూపించింది. అప్పగింతల సమయంలో భావోద్వేగాలు అందరికి కనెక్ట్ అయ్యాయి. మిక్కీ జె మేయర్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేయగా.. చంద్రబోస్ సాహిత్యం.. గాయకులు రితేష్ జి రావు, మనీషా ఈరబత్తిని వోకల్స్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. బృందా గోపాల్ మాస్టర్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా వుంది.

Next Story