- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు చూస్తున్న టైం వచ్చేసింది.. ది వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘నేనో బటర్‌ఫ్లై’ అంటూ సాగే ఈ సాంగ్ చాట్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘మీరు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఆ ప్రత్యేక సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది’ అంటూ ‘ది వెడ్డింగ్ సాంగ్’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ ఎనర్జీతో సాగిన ఈ సాంగ్‌లో సూర్య, అండ్ మమితా డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా.. కాగా.. ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.






