అమ్మ అమ్మేగా.. హృదయాలను హత్తుకుంటోన్న వంద దేవుళ్ళు సెకండ్ సింగిల్

by Chukka Sudharani |

విజయ్ ఆంటోని నటిస్తున్న ‘వంద దేవుళ్ళు’ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘అమ్మ అమ్మేగా’ రిలీజ్ చేశారు.

అమ్మ అమ్మేగా.. హృదయాలను హత్తుకుంటోన్న వంద దేవుళ్ళు సెకండ్ సింగిల్
X

దిశ, సినిమా: ‘బిచ్చగాడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోని.. దర్శకుడు శశి కలయికలో రూపొందుతోన్న మరో చిత్రం ‘వంద దేవుళ్ళు’. స్వాసిక అజయ్, కావ్య, శక్తి తదితరులు కీల పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి రామాంజనేయులు జవ్వాజి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రతి తల్లిలోని స్వచ్ఛమైన సౌందర్యం, అంతులేని ప్రేమ ఉంటుంది.. వంద దేవుళ్ళు నుంచి సెకండ్ సింగిల్ ‘అమ్మఅమ్మేగా’ వచ్చేసింది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘లోకం లోని దేవుళ్లంతా ఏకం అయ్యి వచ్చేసిన అమ్మ అమ్మేగా.. నింగి నేల ఒక్కటయ్యీ నీ కోసమే ఉన్నామన్నా అమ్మ అమ్మేగా.. నిప్పులా ఒకసారి, నీడలా ఒకసారి మనకై మారెరా’ అంటూ సాగిన ఈ సాంగ్ నెట్టింట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటూ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. లింక్


Next Story