‘పరాశక్తి’ నుంచి బిగ్ అప్డేట్.. రొమాంటిక్ లుక్‌లో శ్రీలీల, శివకార్తికేయన్

by Chukka Sudharani |

శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పరాశక్తి’.

‘పరాశక్తి’ నుంచి బిగ్ అప్డేట్.. రొమాంటిక్ లుక్‌లో శ్రీలీల, శివకార్తికేయన్
X

దిశ, సినిమా: శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పరాశక్తి’. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘సింగారాల సీతాకోకవే’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటకు ఎల్వీ రేవంత్, సీన్ రోల్డన్ పాడారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌లో తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ‘పరాశక్తి రెండవ సింగిల్ ప్రోమో రేపు సాయంత్రం 5.30 గంటలకు రాబోతున్నది. జీవీ ప్రకాష్ అందించిన మెలోడీ లోడ్ అవుతోంది’ అంటూ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో శ్రీలీల అండ్ శివకార్తికేయన్ రొమాంటిక్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. కాగా.. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో జయం రవి, ఆథర్వ మురళి, రానా దగ్గుబాటి, అబ్బాస్, గురు సోమసుందరం తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. link


Next Story