- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెన్నెల వెలుగులా ‘వెన్నెల తునక’.. అనుపమ పరమేశ్వర్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తున్న లెటెస్ట్ సరికొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దిశ, సినిమా: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తున్న లెటెస్ట్ సరికొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’. రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్.. సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపింది. అంతే కాకుండా.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు టర్నులతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం ఈనెల 29న రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘వెన్నెల తునక’ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. ‘వెన్నెల వెలుగులా అనిపించే మధురమైన రాగం.. మరీచిక నుంచి రెండవ సింగిల్ ‘వెన్నెల తునక’ మే 23న ఉదయం 11 గంటలకు విడుదల అవుతోంది’ అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






