- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kiran Abbavaram: నీ వెంట వస్తానే నిదురలోన నడిచి అంటున్న యంగ్ హీరో.. పోస్టర్ వైరల్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా ‘దిల్‌రూబా’

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా సినిమా ‘దిల్‌రూబా’ (Dilruba). విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ (Ruksar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ థియేట్రికల్ (Theatrical) రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘అగ్గిపుల్లె..’ రిలీజ్ చెయ్యగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకున్నాయి.
ఇదే జోష్‌లో ఇప్పుడు సెకండ్ సింగిల్ (Second single) అప్‌డేట్ ఇచ్చాడు హీరో కిరణ్ అబ్బవరం. ‘‘నీ వెంట వస్తానే నిదురలోన నడిచి నడిచి’ సాంగ్ జనవరి 26 ఉదయం 9:06గంటలకు రాబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేశాడు. కాగా.. వమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దిల్ రూబా’ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Nee venta vastane niduralona nadichi Nadichi :)
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2025
Tomorrow 9:06am #Dilruba #saregama #sivamcelluloids #Yoodlefilms pic.twitter.com/WjDw48OgdL






