Siddharth: సిద్ధార్థ్ ‘3 BHK’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న సాంగ్

by Chukka Sudharani |   (  Updated:2025-07-31 15:19:52  IST  )

సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘3 BHK’.

Siddharth: సిద్ధార్థ్ ‘3 BHK’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న సాంగ్
X

దిశ, సినిమా: సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ఫస్ట్ సింగిల్ ‘కలలన్నీ’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ ‘ఆగిపోను నేను’ రిలీజ్ చేశారు మేకర్స్. అమృత్ రామ్‌నాథ్ సాంగ్‌ని ఎనర్జీటిక్‌గా కంపోజ్ చేయగా.. దేవ సాహిత్యం అందించడంతో పాటు అద్భుతంగా పాడారు. మూవీ థీంని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్‌లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీలో శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర తదితరలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Video Link

Next Story