‘కుబేర’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ‘అనగనగా కథ’ అంటూ ఆకట్టుకుంటున్న లిరిక్స్

by I. Sairam |   (  Updated:2025-08-15 17:03:39  IST  )

అక్కినేని నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’9Kubera).

‘కుబేర’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ‘అనగనగా కథ’ అంటూ ఆకట్టుకుంటున్న లిరిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’9Kubera). ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

‘అనగనగా కథ’(Anaganaga Katha) అంటూ సాగే ఈ సాంగ్ కుబేర చిత్ర ప్లాట్‌ను విశ్లేషిస్తోంది. ఈ సినిమా ఇతివృత్తం మనకు ఈ పాటలో కనిపిస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్(Chandra Bose) మరోసారి తనదైన పదాలతో ఈ పాటను రాసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం ఈ పాటను మరింత ఆసక్తికరంగా మార్చింది. కాగా ఈ మూవీను జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Click For video ...

Next Story