'డెకాయిట్‌' నుంచి అల్టిమేట్ డాన్స్ నంబర్ 'చిచ్చుబుడ్డి' వచ్చేసింది.. స్టెప్పులతో ఇరగదీసిన శేష్

by Chukka Sudharani |

అడివి శేష్ 'డెకాయిట్‌' నుంచి సెకండ్ సింగిల్ 'చిచ్చుబుడ్డి' వచ్చేసింది.

డెకాయిట్‌ నుంచి అల్టిమేట్ డాన్స్ నంబర్ చిచ్చుబుడ్డి వచ్చేసింది.. స్టెప్పులతో ఇరగదీసిన శేష్
X

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్.. ప్రస్తుతం ‘డెకాయిట్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇందులో నుంచి వచ్చిన ప్రోమోలు, ఫస్ట్ సింగిల్ 'రుబారూ' ఒక రగ్గడ్ హీరోని ప్రజెంట్ చేశాయి. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ 'చిచ్చుబుడ్డి'ని విడుదల చేశారు. ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. 'చిచ్చుబుడ్డి' పాట సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్ తొలిసారిగా తెరపై డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్‌లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఫోక్ బీట్‌లతో కూడిన పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు. భారీ, జనాలతో కూడినసెట్‌లో, కళ్లు చెదిరే కొరియోగ్రఫీతో చిత్రీకరించబడిన ‘చిచ్చుబుడ్డి’ ప్రజెంట్ వైరల్ అవుతూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Next Story