- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజాకార్యక్రమాలతో ‘SDT19’ స్టార్ట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో రాబోతున్న 19వ ప్రాజెక్ట్ తాజాగా పూజాకార్యక్రమాలతో ‘SDT19’ ఘనంగా స్టార్ట్ అయ్యింది.

దిశ, సినిమా: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘SDT19’ అనౌన్స్‌మెంట్ సినీ ప్రియుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టు ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్‌కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది. దర్శక ద్వయం సుజిత్ & సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మిథిక్ సై-ఫై నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేస్తూ, గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇక సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో.. ఒక యోధుడు విస్తారమైన ఆకాశ గోళాల ముందు నిలబడి ఉండటం, కథ స్కేల్, విజువల్ గ్రాండ్యూర్, విజన్ చూపిస్తోంది. అంతే కాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు కూడా తాజాగా నిర్వహించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇతర నటీనటులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.






