‘దృశ్యం 3’ ఓటీటీ డీల్ క్లోజ్

by Pulgam srinivas |

‘దృశ్యం 3’ అన్ని భాషల డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘దృశ్యం 3’ ఓటీటీ డీల్ క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘దృశ్యం 3’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో మీనా హీరోయిన్‌గా నటించగా, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌పై ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ‘దృశ్యం 3’ అన్ని భాషల డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన కొన్ని వారాల అనంతరం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘దృశ్యం’ తొలి రెండు భాగాలను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే మూడో భాగాన్ని నేరుగా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. మరి ఈ సినిమా మూడవ భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story