ఫన్ ట్రిపుల్ డోస్.. సేవ్ ద టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

సూపర్ హిట్ సిరీస్‌లో మూడో సీజన్ ‘సేవ్ ద టైగర్స్’ మళ్లీ వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఫన్ ట్రిపుల్ డోస్.. సేవ్ ద టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ఓటీటీ లవర్స్‌ను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెబ్ సిరీస్‌లో ‘సేవ్ ద టైగర్స్’ ఒకటి. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతూ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఎటువంటి అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంది. దీంతో మొదటి సీజన్ ఊహించని విజయం సాధించగా, రెండో సీజన్ ‘సేవ్ ద టైగర్స్ 2’ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అది కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో మూడో సీజన్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ముగ్గురు భార్యాబాధితుల కథతో తెరకెక్కి ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు మూడో సీజన్‌తో జియో హాట్‌స్టార్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు.. ‘వాళ్లు దేవుడి ప్లాన్‌ను నమ్మారు.. కానీ దేవుడే స్క్రిప్ట్‌ను మార్చేస్తే ఎలా ఉంటుంది?.. 3 రెట్ట వినోదం, 3 రెట్ల గందరగోళం అండ్ 3 రెట్ల విసుగుకు సిద్ధంగా ఉండండి! సేవ్ ద టైగర్స్ 3 త్వరలో జియో హాట్‌స్టార్‌లో రాబోతోంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఫన్, కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్‌తో పాటు మధ్యలో దేవుడి ఎంట్రీ సీజన్ 3పై ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ తమదైన టైమింగ్‌తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది.

Next Story