మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్‌లో సత్య కొత్త సినిమా స్టార్ట్

by Chukka Sudharani |

మత్తువదలరా ఫ్రాంచైజ్‌తో బ్లాక్ బస్టర్ విజయాలు తర్వాత సత్య ప్రధాన పాత్రలో కొత్త సినిమా స్టార్ట్ అయింది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్‌లో సత్య కొత్త సినిమా స్టార్ట్
X

దిశ, సినిమా: మత్తువదలరా ఫ్రాంచైజ్‌తో బ్లాక్ బస్టర్ విజయాలు తర్వాత సత్య ప్రధాన పాత్రలో కొత్త సినిమా స్టార్ట్ అయింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ కొత్త సినిమా రాబోతుండగా.. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సమక్షంలో ఈ సినిమా ముహూర్తం వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇందులో రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Next Story