Rao Bahadur: గుర్తుంచుకో అనుమానం ఒక దెయ్యం.. గ్లింప్స్ అప్డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చే

by Chukka Sudharani |

డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా సత్యదేవ్ ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్.

Rao Bahadur: గుర్తుంచుకో అనుమానం ఒక దెయ్యం.. గ్లింప్స్ అప్డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చే
X

దిశ, సినిమా: వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ (Satyadev).. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. దీనికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రావు బహద్ధూర్’ (Rao Bahadur) అనే టైటిల్ రాబోతున్న ఈ చిత్రాన్ని సూప‌ర్‌ స్టార్ మ‌హేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీచ‌క్రాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అప్లాజ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చెయ్యగా.. అందులో సత్యదేవ్ లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సినిమా గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ది వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా ‘రావు బహదూర్’ టీజర్ ఆగస్టు 18వ తేదీన ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కాబోతుంది. గుర్తుంచుకో ‘అనుమానం ఒక దెయ్యం.. అనుమానం పెనుభూతం.. రావుబహదూర్ 2026లో వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది’ అని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. లింక్


Next Story