- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుదంటే?
ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

దిశ, సినిమా: వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ సంస్థ అయిన జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సైకాలాజికల్ డ్రామా చిత్రం, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా థియేటర్లలోకి వచ్చింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని, భారీ అంచనాలను పెంచాయి. అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
అయినప్పటికీ, సినిమాలో సత్యదేవ్ కనబరిచిన నటన, దర్శకుడు వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్, కథలోని ఇంటెన్సిటీకి సినీ విమర్శకులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా.. జూలై 31 నుంచి ఈ సినిమాను ఓటీటీ వేదికగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో ఈ విభిన్నమైన కథను చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు






