- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్య దేవ్ వైల్డ్ యాక్షన్ మోడ్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
వెర్సటైల్ హీరో సత్యదేవ్ తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ పంచుకున్నాడు.

దిశ, సినిమా: డిఫరెంట్ కథలతో, స్పెషల్ క్రేజ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో వెర్సటైల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. త్వరలో మహేశ్ బాబు నిర్మాణంలో ‘రావు బహదూర్’ చిత్రంతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇంతలోనే మరో మూవీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేశాడు హీరో. సత్యదేవ్ కెరీర్‌లో 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘సమవర్తి’ అనే క్యాచీవ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కొందరు వ్యక్తులు కత్తులు, వెపన్స్‌తో సత్యను చుట్టుముట్టగా.. చెవిలో హెడ్ ఫోన్స్, నోట్లో బీడీతో నుదుటిపై గాటుతో చేతులు కట్టుకుని కూల్ మాస్ ఇంటెన్స్‌గా చూస్తున్న సత్యదేవ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రానికి అజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తుండగా.. వైల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రుద్ర పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యానర్‌పై శశిధర్ రెడ్డి, శివ చరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో రూపొందుతోండగా త్వరలో రిలీజ్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.






