Sathyaraj: సత్యరాజ్ సినిమా ట్రైలర్ అప్డేట్.. పోస్టర్ వైరల్

by Chukka Sudharani |

వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’.

Sathyaraj: సత్యరాజ్ సినిమా ట్రైలర్ అప్డేట్.. పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో రాబోతున్న ఈ సరికొత్త కాన్సెప్ట్‌ను వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్నాడు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇందులో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలతో పాటు గ్లింప్స్, టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ ఈనెల 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈనెల 22న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. link

Next Story