NBK 111 శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

by Chukka Sudharani |

నందమూరి నటసిహం, మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.

NBK 111 శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, సినిమా: నందమూరి నటసిహం, మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల ఈ చిత్రానికిసంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తవడంతో పాటు ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసి ప్రస్తుతం షూటింగ్‌లో వేగం పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా.. ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో బిగ్ అప్డేట్ పంచుకున్నారు. ఈ మేరకు NBK 111 శాటిలైట్ హక్కులను ZeeTVTelugu భారీ ధరకు దక్కించుకున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Next Story