- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేజీ సంస్థల చేతికి 'మా ఇంటి బంగారం' శాటిలైట్, డిజిటల్ హక్కులు
'మా ఇంటి బంగారం' డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్, శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుండగా, అనంతరం స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సమంత పలు భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే 'ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2'లో తన యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ప్రశంసలు అందుకున్న సమంత, 'మా ఇంటి బంగారం'లో కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది.






