'అఖండ 2: తాండవం' బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

by Ajay Maddhiboyina |

నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'అఖండ 2: తాండవం. ఈ సినిమా అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'అఖండ 2: తాండవం. ఈ సినిమా అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా వచ్చిన బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్ పాన్ ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌ని తమన్ సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం వున్న పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులతో రికార్డ్ చేశారు. కాగా ఇప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్ ని పరిచయం చేస్తున్నారు. సర్వేపల్లి సిస్టర్స్ ‘అఖండ 2: తాండవం’ కోసం తమ డివైన్ వోకల్స్ అందించారు. ఇప్పటికే వచ్చిన అఖండ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించగా అఖండ 2 బ్యాగ్రౌండ్ స్కోర్ పై అంచనాలు రెట్టింపవుతున్నాయి.

Next Story