‘శారీ’ సినిమా రిలీజ్ వాయిదా.. చివరి నిమిషంలో షాకిచ్చిన ఆర్జీవీ (ట్వీట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ప్రొడక్షన్‌లో LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’.

‘శారీ’ సినిమా రిలీజ్ వాయిదా.. చివరి నిమిషంలో షాకిచ్చిన ఆర్జీవీ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ప్రొడక్షన్‌లో LLP బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. దీనికి గిరి కృష్ణకమల్(Giri Krishnakamal) దర్శకత్వం వహిస్తుండగా.. సత్య యాదు, ఆరాధ్య దేవి(Aradhya Devi) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ‘శారీ’ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.

అయితే చాలా ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసుకువస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శారీ’ మూవీ ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ విడుదల వాయిదా పడినట్లు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి.. కానీ ఫిబ్రవరి 28న విడుదల కావడం లేదు. అన్ని భాషల్లో మార్చి 21న రిలీజ్ కానుంది’’ అని రాసుకొచ్చారు. ఇక అది చూసిన వారంతా చివరి నిమిషంలో షాకిచ్చాడుగా అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story