Malavika Mohanan: నేను ఇంతకు ముందు చేసిన దానికంటే ఇది ప్రత్యేకమైనది.. మాళవిక మోహనన్ కామెంట్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సినీ కెరీర్‌లో బిజీ బిజీగా గడుపుతోంది.

Malavika Mohanan: నేను ఇంతకు ముందు చేసిన దానికంటే ఇది ప్రత్యేకమైనది.. మాళవిక మోహనన్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ సినీ కెరీర్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రజెంట్ ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘సర్దార్-2’ ఒకటి. తమిళ స్టార్ కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సర్దార్’ కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకోంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని చిత్రాలను పంచుకుంటూ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

‘ఇది సర్దార్2 (Sardar2)యొక్క చివరి భాగం. నేను ఈ ప్రాజెక్ట్‌ను సినిమాలోనే అత్యంత సవాలుతో కూడిన షెడ్యూల్‌తో ప్రారంభించాను. అలాగే బ్యాంకాక్‌లో అత్యంత సరదా షెడ్యూల్‌తో ముగించాను. ఇది ఎంత పిచ్చి ప్రయాణం! కార్తీ మీరు పని చేయడానికి ఒక అద్భుతమైన రత్నం. మీతో వర్క్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ మిత్రన్‌కు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉంది. అలాగే ప్రత్యేకమైనది. త్వరలో సినిమాహాళ్లలో కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.

Next Story