- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఫ్యాషన్ షోలో హీరోయిన్‌కు వేధింపులు
హిందీ టీవీ సీరియల్ హీరోయిన్ సారా ఖాన్ ఢిల్లీ ఫ్యాషన్ షోలో వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన భయానక అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ తమకు సెక్యూరిటీ అందించడంలో విఫలమయ్యారని తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : హిందీ టీవీ సీరియల్ హీరోయిన్ సారా ఖాన్ ఢిల్లీ ఫ్యాషన్ షోలో వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన భయానక అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈవెంట్ ఆర్గనైజర్స్ తమకు సెక్యూరిటీ అందించడంలో విఫలమయ్యారని తెలిపింది. ముందుగా ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదని.. పైగా తెలియని హోటల్‌కు తరలించారని.. కారు, డ్రైవర్‌ను ఇచ్చి చేతులు దులుపుకున్నారని వివరించింది. దీంతో సెక్యూరిటీ కారణంగా తాను ఢిల్లీ 6 ఫ్యాషన్ రన్ వే వీక్‌లో పాల్గొనేందుకు సుముఖంగా లేనని చెప్పడంతో.. తన స్టాఫ్‌రు కూడా బెదిరించారని చెప్పింది. దీంతో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిన తాను.. తన డబ్బులతోనే రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయానని తెలిపింది. పద్దెనిమిదేళ్ల కెరీర్‌లో ఇలాంటి భయానక వాతావరణాన్ని ఫేస్ చేయడం ఫస్ట్ టైమ్ అని చెప్పింది సారా. ఈ సందర్భంగా అభిమానులకు అపాలజీ చెప్పింది. ఫ్యాన్స్ తనను రన్ వే మీద చూడాలనుకున్నా.. పరిస్థితి ఇలా ఉండటంతో వారి అంచనాలను అందుకోలేకపోయానని.. క్షమాపణలు కోరింది.






