Sara Arjun:అదృష్టం అంటే ఈమెదే.. వెంట పడుతున్న స్టార్ ఫిల్మ్ మేకర్స్

by Pulgam srinivas |

పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సారా అర్జున్‌

Sara Arjun:అదృష్టం అంటే ఈమెదే.. వెంట పడుతున్న స్టార్ ఫిల్మ్ మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ క్యూటెస్ట్ బ్యూటీ సారా అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ నటుడు విక్రమ్ హీరోగా రూపొందిన 'థైవ తిరుమల్'లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంతకాలం క్రితం ఈమె తెలుగులో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన 'దాగుడుమూతల దండాకోర్'లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో హీరోయిన్ మరియు కీలక పాత్రల్లో నటిస్తూ మంచి జోష్‌లో కెరీర్‌ను ముందుకు సాగిస్తుంది. రీసెంట్ టైంలో ఈమెకు వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

కొంతకాలం క్రితం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్, ధురంధర్: ది రివెంజ్ చిత్రాల్లో ఈమె హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక దీంతో వరుసగా ఈ బ్యూటీకి పాన్ ఇండియా చిత్రాల్లో, సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

Next Story