Pati Patni Aur Woh: బంపర్ ఆఫర్ అందుకున్న స్టార్ కిడ్.. బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా సీక్వెల్‌లో చాన్స్

by Chukka Sudharani |

ముదస్సర్ అజిజ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur Woh) ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే.

Pati Patni Aur Woh: బంపర్ ఆఫర్ అందుకున్న స్టార్ కిడ్.. బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా సీక్వెల్‌లో చాన్స్
X

దిశ, సినిమా: ముదస్సర్ అజిజ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur Woh) ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని టి-సిరీస్ బ్యానర్‌పై భూషన్ కుమార్, రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్ నిర్మించారు. ఫుల్ ఫన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘పతి పత్నీ ఔర్ వో’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఆయుష్మాన్ (Ayushman), సారా ప్రధాన పాత్రల్లో ఈ సీక్వెల్ తెకెక్కుతుందని తెలుస్తుండగా.. ధర్మా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. సారా త్వరలో ‘మెట్రో ఇన్ దినో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే.. హిట్ సీక్వెల్‌లో సారా నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతుండగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story