- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘స్వాతిముత్యం’ దర్శకుడితో సంతోష్ శోభన్
స్వాతిముత్యం సినిమా దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో సంతోష్ శోభన్ తన కొత్త మూవీ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని UV Creations మరియు AR Films సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ మొదటి నుండి కామెడీ, రొమాంటిక్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సరైన భారీ విజయం బాక్సాఫీస్ వద్ద అందుకోలేకపోయిన ఈ నటుడు, కొంతకాలం క్రితం విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సక్సెస్ తర్వాత ఈ యంగ్ హీరో తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో, ఏ జోనర్‌లో తెరకెక్కుతుందో అనే ఆసక్తి చిత్రపరిశ్రమలో పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన తదుపరి సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది.
స్వాతిముత్యం సినిమా దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో సంతోష్ శోభన్ తన కొత్త మూవీ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని UV Creations మరియు AR Films సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ లాక్ అయిందని, టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.






